Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతలో బీహార్ ఆటవిక చర్య : మంచినీటి తొట్టె వద్దన్నందుకు మహిళను చితక్కొట్టారు

గతంలో బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఆటవిక చర్యలు జరుగుతుండేవి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ చర్యకు పాల్పడింది ఏకంగా అధికార టీడీపీకి చెందిన గ్రామ సర్పం

అనంతలో బీహార్ ఆటవిక చర్య : మంచినీటి తొట్టె వద్దన్నందుకు మహిళను చితక్కొట్టారు
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:34 IST)
గతంలో బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఆటవిక చర్యలు జరుగుతుండేవి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ చర్యకు పాల్పడింది ఏకంగా అధికార టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కావడం గమనార్హం. తన పొలంలో పశువుల కోసం మంచినీటి తొట్టెను నిర్మించవద్దని గట్టిగా చెప్పిన పాపానికి ఓ మహిళను గ్రామ సర్పంచ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి చితక్కొట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
అనంతపురం జిల్లా, కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో పశువులకు తాగునీటి కోసం ఓ తొట్టిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తొట్టెను సుధ అనే మహిళ స్థలంలో నిర్మించాలని సర్పంచ్ నాగరాజు తీర్మానం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని సుధ వ్యతిరేకించింది. తన స్థలంలో తొట్టె నిర్మించడానికి ఒప్పుకోనని ఆమె స్పష్టం చేసింది.
 
దీంతో సర్పంచ్ నాగరాజు, చంద్ర అనే మరో వ్యక్తి ఆమెను చితకబాదారు. కాళ్లతో తన్ని, జుట్టుపీకి తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. సుధపై దాడి జరుగుతున్నప్పుడు గ్రామస్తులు తీసిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. 
 
సర్పంచ్ స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మహిళను కొడుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. ఇదేంటన్ని ప్రశ్నించలేదు. పైగా అందరూ చట్టూ చేరి వేడుకగా చూశారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దాడి తర్వాత తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే, ఈ దాడికి తెగబడింది స్థానిక టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అనుచరులుగా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెవి రంధ్రంలో దూరిన పైతాన్.. ఫేస్‌బుక్‌లో సెల్ఫీ.. షేర్లు, లైక్స్ వెల్లువ