Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఏపీ ప్రత్యేక హోదా'పై తెలుగు సినీ హీరోలు ఎందుకు స్పందించరు?

ప్రత్యేక హోదాపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ, టీడీపీ ఏపీ ప్రజలను దారుణంగా వంచించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంతోషంగా స్వీకరించి ఆమోదించారు. అంతేకాదు ఒక అడుగు మ

'ఏపీ ప్రత్యేక హోదా'పై తెలుగు సినీ హీరోలు ఎందుకు స్పందించరు?
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:31 IST)
ప్రత్యేక హోదాపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ, టీడీపీ ఏపీ ప్రజలను దారుణంగా వంచించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంతోషంగా స్వీకరించి ఆమోదించారు. అంతేకాదు ఒక అడుగు ముందుంకు వేసి హోదా కంటే ప్యాకేజీ మంచిదనే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టే విధంగా తెలియేజేశారు. ఈ విషయంపై కనీసం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా స్పందించకపోవడం విడ్డూరం. 
 
కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఒక రోజు బంద్ పాటించడం తప్ప, వారు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం గానీ, ప్రజలను చైతన్యపర్చడం గానీ చేయకుండా మౌనం పాటిస్తున్నాయి. ప్రతిపక్షనేత జగన్ సైతం ప్రత్యేక హోదా వల్ల ప్రజానికానికి ఎంత ప్రయోజనమో, ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభాపడేది ఎవరో విశ్లేషిస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టల్సింది పోయి, అసలు ఆ విషయమే పట్టనట్లు వ్యహరిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు అసలు అర్థం కావడం లేదు. 
 
తిరుపతి సభలో ప్రత్యేక హోదా కోసం మూడంచెలుగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి, కాకినాడ సభలో తన పోరాట తీరు ఏంటో ప్రకటించలేదు సరికదా చంద్రబాబును కానీ, మోదీని గానీ ప్రత్యక్షంగా విమర్శించకుండా, సరైన ముగింపు ఇవ్వకుండా సభను ముగించారు. అంతేగాక కాకినాడ సభలో తన అభిమాని మరణించడం పట్ల కలత చెందిన పవన్ ఇక సభలను నిర్వహించనని పేర్కొన్నారు. మరి సభలు నిర్వహించకుండా ప్రత్యేక హోదా పోరాటాన్ని పవన్ ఎలా కొనసాగిస్తారనేది ఇప్పుడు అభిమానుల ముందున్న ప్రశ్న.
 
ఇదిలావుండగా ఆంధ్రా ప్రజల్లో తెలుగు సినీ హీరోలకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రజల అభిమానంతో కోట్లకు పడగలెత్తారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలంతా సీమాంధ్ర ప్రేక్షకుల అభిమానంతో ఎదిగినవారే. మరి ఇప్పుడు మోదీ, చంద్రబాబు కల్సి తమ సీమాంధ్ర ప్రజలకు హోదా ఇవ్వలేము అంటుంటే వీళ్లలో ఒక్కరి గొంతు కూడా పెగలడం లేదు. తెలుగు సినీ హీరోల సినిమాలు కోట్ల రూపాయిల కలెక్షన్లు తమ సినిమాలకు వస్తున్నాయని తెగ చెబుతుంటారు. ఆ కలెక్షన్లను ఇస్తుంది ఎవ్వరూ ఈ ప్రాంతపు ప్రజలు కాదా? 
 
సినిమాలలో పేజీలకొద్దీ డైలాగులు కుమ్మరించే ఈ హీరోలు... తమను ప్రేమించి, ఆరాధించే ఆంధ్ర ప్రజల కోసం గొంతు విప్పి మాట్లాడలేరా? ఆడియో క్యాసెట్ ఫంక్షన్లలోను, విజయోత్సవ సభలలలోను మీరే మా దేవుళ్ళు, మీరంటే మాకు ప్రాణం అంటూ ఉపన్యాసాలు దంచే ఈ హీరోలు రాష్ట్ర సమస్యలపై ఎందుకు మాట్లాడరు? బగుశా తాము హైదరాబాదులో ఉంటున్నామనే భావనో లేక భయమో? ఒకవేళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే తెలంగాణా ప్రభుత్వం తమపై కక్ష కడుతుందనే భయపడటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కె.సి.ఆర్. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై వ్యతిరేకించడం లేదు కూడా. 
 
ఒకవేళ చంద్రబాబు సహించరని భయపడుతున్నారో? ప్రక్క రాష్ట్రమైన తమిళనాఢులో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సినీ హీరోలు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. మరి తెలుగు సినీ హీరోలకు ఏమైంది? సినిమాలలో విపరీతంగా రెచ్చిపోయి డైలాగులు చెప్పే మన హీరోలు ప్రత్యేక హోదా గురించో లేక ప్రత్యేక ప్యాకేజీ గురించో ఎందుకు మాట్లాడరు?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈతకు వెళ్లారు.. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు... వరంగల్‌లో విషాదం