Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాంఘై తరహాలో నూతన రాజధాని.. అన్ని వనరులు ఆంధ్రాలో ఉన్నాయి.. చంద్రబాబు

షాంఘై తరహాలో నూతన రాజధాని.. అన్ని వనరులు ఆంధ్రాలో ఉన్నాయి.. చంద్రబాబు
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (22:12 IST)
చైనా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరిన చంద్రబాబులో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ చైనాతో రకరకాల ఒప్పందాలను కుదుర్చుకున్న ఆయన షాంఘై సిటీపై తెగ ముచ్చట పడిపోతున్నారు. అక్కుడున్న పరిస్థితులే ఇక్కడా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని షాంఘై తరహాలో తయారు చేయవచ్చునని ఆయన చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే తాము పని చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
 
మన పొరుగుదేశమైన చైనాలోని షాంఘై నగరం పాతికేళ్ళలో 68 రెట్లు పెరిగిందని తెలిపారు. ఆ నగర తరహాలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. షాంఘైలో రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ల తరహాలో ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రపంచస్థాయి పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 ప్రపంచంలో ప్రముఖ నౌకాశ్రయాల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయని అలాగే ప్రపంచంలో 60 శాతం సెల్ ఫోన్లు చైనాలోనే తయారువుతున్నాయని చంద్రబాబు చెప్పారు. భారత్తో సంబంధాలకు చైనా ఉత్సాహాం చూపిస్తుందని అన్నారు. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి పరిశ్రమలు రావాలని చంద్రబాబు ఆకాక్షించారు. గంటకు 450 కి.మీ వేగంతో నడిచే రైల్వే ట్రాక్ చైనా ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైల్వే ట్రాక్ను చైనీయులు 10 ఏళ్లలో నిర్మించారని చంద్రబాబు పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu