Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గగుడి ఈవో ఉంటే ఉంటుంది.. లేదా ఊడుతుంది : ఈవో నర్సింగరావు!

దుర్గగుడి ఈవో ఉంటే ఉంటుంది.. లేదా ఊడుతుంది : ఈవో నర్సింగరావు!
, శుక్రవారం, 28 నవంబరు 2014 (13:23 IST)
బెజవాడ దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా నియమితులు కావడమే మహాభాగ్యమని కొత్త ఈవో సీహెచ్ నర్సింగరావు అభిప్రాయపడ్డారు. అందువల్ల విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గే ప్రసక్తే లేదని, అలా నడుచుకోవడం వల్ల ఈవో పదవి ఉంటే ఉంటుంది.. ఊడితే ఊడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇటీవలి కాలంలో బెజవాడ దుర్గగుడిలో విధులు నిర్వహించే అధికారులపై రాజకీయ ఒత్తిడిలు ఎక్కువైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. విజయవాడ కనకదుర్గ గుడి ఈఓగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్.నర్సింగరావు విధి నిర్వహణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి రాజీ పడేది లేదని చెప్పారు. 
 
ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దుర్గమ్మ తల్లి ఆలయంలో ఈఓగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ప్రకటించిన ఆయన విధి నిర్వహణలో నిక్కచ్చిగానే ముందుకెళతానని చెప్పారు. 
 
ఈ క్రమంలో తన పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో దుర్గ గుడి ఈఓగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దుర్గ గుడి ఆలయంలో రాజకీయ ఒత్తిడులు మరింత పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu