Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనకదుర్గ గుళ్లో పాడుపని... నగ్న చిత్రాలు చూసిన పోలీస్

కనకదుర్గ గుళ్లో పాడుపని... నగ్న చిత్రాలు చూసిన పోలీస్
, బుధవారం, 1 అక్టోబరు 2014 (16:50 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులలో ఓ పోలీస్ పాడు పని చేశాడు. ఓ పోలీసు అధికారి ఒకవైపు మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం జరుగుతుండగా దాని మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ దొరికిపోయాడు. విధి నిర్వహణను పక్కన పెట్టి సీఐ ప్రసాద్ ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూస్తూ ఉన్నాడు
 
అక్కడే వున్న మీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. సీఐ చేసిన ఈ ఘనకార్యం బయటకి పొక్కడంతో అధికారులు అతనని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ అంశం మీద కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం మీద వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయవాడ శాంతిభద్రతల డీసీపీని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu