Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ పంచ్... జైట్లీ ముందు తిష్ట వేసిన వెంకయ్య, సుజనా చౌదరి... హోదా ఇవ్వాల్సిందే...

వెనుకటికి ఎవరో నా మీసాలు పుట్టినప్పుడు పుట్టింటావ్ నువ్వు అని అన్నట్లుగా... మీ రాజకీయ అనుభవం అంత లేదు నా వయసు... అని పవన్ తిరుపతి సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొరడా దెబ్బల్లా బాగా తగులుకున్నాయి. కేంద్రంలో

పవన్ పంచ్... జైట్లీ ముందు తిష్ట వేసిన వెంకయ్య, సుజనా చౌదరి... హోదా ఇవ్వాల్సిందే...
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (19:13 IST)
వెనుకటికి ఎవరో నా మీసాలు పుట్టినప్పుడు పుట్టింటావ్ నువ్వు అని అన్నట్లుగా... మీ రాజకీయ అనుభవం అంత లేదు నా వయసు... అని పవన్ తిరుపతి సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొరడా దెబ్బల్లా బాగా తగులుకున్నాయి. కేంద్రంలో చలనం వచ్చింది. రాష్ట్రంలో పవన్ సునామీకి తెదేపా అతలాకుతలం అవుతుంటే కేంద్రంలో మంత్రివర్యలుగా ఉన్న తెదేపా నాయకులు సుజనా చౌదరి వెంకయ్యతో భేటీ అయ్యారు. 
 
ఆ తర్వాత వెంకయ్య, సుజనాలు ఇద్దరూ కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు తిష్ట వేశారు. ప్రత్యేక హోదా హీట్ పవన్ ఎంట్రీతో తీవ్రరూపం దాల్చుతుందని వారు చెప్పినట్లు సమాచారం. దాదాపు గంటన్నర పాటు వారు జైట్లీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా విభజన హామీలతో పాటు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. 
 
వెంకయ్య నాయుడు సీనియర్ నాయకులు అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ నిర్దాక్షిణ్యంగా ఆయన విభజనకు ముందు రాజ్యసభలో చెప్పిన మాటలు... ఆ తర్వాత వెనక్కి వెళ్లిన వ్యవహారం అంతా సూటిగా చెప్పేసరికి ఇక తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలవారోత్సవాలు ప్రారంభం: నీటి కోసమే సమయమంతా వృధా.. రాతియుగంలో ఖాళీ బిందెతో వెళ్తే?