Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలి: వర్ల రామయ్య

జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలి: వర్ల రామయ్య
, ఆదివారం, 5 జులై 2015 (15:19 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ అవినీతి వ్యవహారంలో స్టాక్, టన్నుల వ్యవహారాన్ని తేల్చాలని వర్ల డిమాండ్ చేశారు. 
 
ఆదివారం విజయవాడలో వర్ల మాట్లాడుతూ.. జగన్ అవినీతి బాగోతాన్ని.. డబ్బు తరలించేందుకు స్టాక్, టన్నులు అంటూ కోడ్ భాష ఉపయోగించడాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచాలన్నారు. జగన్ అవినీతి గురించి తెలుసుకున్న ఎవరైనా ముక్కు వేలేసుకుంటారని ఆయన చెప్పారు. 
 
ప్రపంచంలో దొంగతనానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకున్న వ్యక్తి జగన్ అని వర్ల రామయ్య తెలిపారు. ప్రజాధనం దోచుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకున్న జగన్, దొంగతనాలకు కొత్త భాష్యం చెప్పారని మండిపడ్డారు. జగన్ అవినీతి తవ్వే కొద్దీ బయటకు వస్తోందని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu