తిరుమల: తిరుమల పుష్పగిరి మఠంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ తనిఖీలు జరిపారు. తిరుమల చరిత్రలో మొదటిసారి దేవదాయశాఖ అధికారులు మఠాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పుష్పగిరి మఠానికి సంబంధించి బయటపడ్డ ఆర్థిక అక్రమాలపై హైకోర్టు విచారణకు అదేశాలు జారీ చేసింది. దీనితో మఠానికి చేరుకొని పలు రికార్డులను, సిబ్బందిని రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ తనిఖీ చేస్తున్నారు. నిన్న కడపలోని మఠం ప్రధాన కేంద్రంలో విచారణ నిర్వహించారు. విధి నిర్వహణలో భ్రమరామంబ నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరుంది. దీనితో ఈ విచారణతో వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.