Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ హీరో, రోజా హీరోయిన్.. అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు అనే సినిమా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హీరోగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా హీరోయిన్‌గా "అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు" అనే పేరిట కొత్త సినిమా తీస్తే బాగుంటుందని ఏపీ

జగన్ హీరో, రోజా హీరోయిన్.. అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు అనే సినిమా..?
, బుధవారం, 12 జులై 2017 (15:32 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హీరోగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా హీరోయిన్‌గా "అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు" అనే పేరిట కొత్త సినిమా తీస్తే బాగుంటుందని ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన అనురాధ.. జగన్, రోజాలపై విమర్శలు గుప్పించారు. జగన్‌, రోజాలు రాజకీయాలకు ఏమాత్రం పనికిరారని ధ్వజమెత్తారు. 30 ఏళ్లపాటు సీఎంగా ఉండాలనే అత్యాశలో జగన్ వున్నారని.. అది ఎన్నటికీ నెరవేరబోదని ఆమె అన్నారు. 
 
మద్యం వ్యాపారులను పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు అనుసరిస్తున్న మద్యం నియంత్రణ విధానంపై విమర్శలు చేసే హక్కు లేదని అనురాధ దుమ్మెత్తిపోశారు. రోజా సినిమా భాషలో చెప్పాలంటే... అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదనే డైలాగును రోజా గుర్తుంచుకోవాలని సెటైర్లు విసిరారు.

రోజా, జగన్ కలసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. ఈ సినిమాకు 'అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు' అనే టైటిల్ పెట్టి.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం అన్నీ విజయసాయిరెడ్డి అందిస్తే భలే మస్తుగా వుంటుందని అనురాధ ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో నుంచి కొత్త ప్లాన్.. జియో ఫైబర్ పేరిట.. 100Mbpsతో 100జీబీ ఉచిత డేటా