Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా : కళా వెంకట్రావు

టీడీపీలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా : కళా వెంకట్రావు
, ఆదివారం, 4 అక్టోబరు 2015 (13:00 IST)
తెలుగుదేశం పార్టీలో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఆదివారం ఉదయం తెదేపా కేంద్ర, తెలుగు రాష్ట్రాల నూతన కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ తెదేపాను కార్యకర్తల పార్టీగా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎప్పుడూ వెన్నంటే ఉంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారన్నారు.  
 
పార్టీ నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారన్నారు. ప్రజలు ఆశించిన స్థాయిలో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu