Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభ్రతకే అధిక ప్రాధాన్యం : టీటీడీ సాధికార కమిటీ ఛైర్మన్

శుభ్రతకే అధిక ప్రాధాన్యం : టీటీడీ సాధికార కమిటీ ఛైర్మన్
, సోమవారం, 24 నవంబరు 2014 (20:33 IST)
తిరుమల : ఆధ్యాత్మిక చింతనతో అలరారుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యత ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం సాధికార కమిటీ ఛైర్మన్ జేసీ శర్మ తెలిపారు. సోమవారం తిరుమలలో ఆయన స్వచ్ఛ తిరుమలలో జరిగిన స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

 
తిరుమల అన్నమయ్య భవన్ వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లడుతూ, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చాలా అరుదైన కార్యక్రమం అని తెలిపారు. వేలాది మంది యాత్రికులు వచ్చే తిరుమలను ఎంతో శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుమలను పరిశుభ్రంగా ఉంచడంలో అర్చకుల నుంచి రోడ్లు శుభ్రం చేసే కార్మికుల వరకూ అందరికి బాధ్యత ఉందన్నారు. అందరూ కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
 
ప్రతి ఇల్లు, కార్యాలయం, షాపు, మఠం, హోటల్ ప్రతీ ఒక్కరు రెండు బకెట్ల విధానాన్ని పాటించాలని కోరారు తడి వ్యర్థాలు ఒకటి, పొడి వ్యర్థాలకు ఒకటి వాడాలని సూచించారు. దీనివలన సులభంగా చెత్తను ఎత్తివేయవచ్చునని అన్నారు. దీనిపై చైతన్యం కలిగించాలని అన్నారు. అనంతరం కాకులకొండలోని డంప్ యార్డును పరిశీలించారు. ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu