Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శేషాచలం ఎన్‌కౌంటర్ కేసును విచారించలేం : సుప్రీంకోర్టు

శేషాచలం ఎన్‌కౌంటర్ కేసును విచారించలేం : సుప్రీంకోర్టు
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:05 IST)
చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును విచారిస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. అందువల్ల పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని సూచన చేసింది. 
 
ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును విచారిస్తున్నందున తాము కలగజేసుకోబోమని, తిరిగి హైకోర్లునే ఆశ్రయించాలని ప్రధాన న్యయమూర్తి హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్ బూటకమని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu