Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా...

నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా...
, సోమవారం, 30 నవంబరు 2015 (14:25 IST)
నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. కానీ, నన్ను అనేక సమస్యలు చుట్టిముట్టాయి. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం వెతుక్కునేందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అంటూ గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ రాసి, వంద అడుగులు ఎత్తువుండే కటౌట్ ఎక్కి హంగామా సృష్టించాడు. ఈ సంఘటన విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జరుగగా, ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
క్యాంపు కార్యాలయం ముందు ఉన్న 100 అడుగుల చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కిన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అడ్డెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజులు అనే రైతు... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతేకాదు, దీనికి సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచాడు. వ్యవసాయంలో నష్టం, బాధిస్తున్న క్యాన్సర్ వ్యాధి, ఆర్థిక సమస్యలే తన ఆత్మహత్యా యత్నానికి కారణమని నోట్ రాసి ఉంచాడు. 
 
ఈ క్రమంలో, సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట కొంచెం టెన్షన్ ఏర్పడింది. అయితే, గోవిందరాజులుతో మాట కలిపిన పోలీసులు... అతన్ని కిందకు దించడంలో సఫలమయ్యారు. వెంటనే అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని... మీడియాతో మాట్లాడనీయకుండా తీసుకెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu