Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్‌కు .. అందుకే తెరపైకి శ్రీధరన్‌!

ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్‌కు .. అందుకే తెరపైకి శ్రీధరన్‌!
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలలో చేపట్టనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఢిల్లీ మెట్రో రైల్ సంస్థకు అప్పగించారు. అందుకే రంగంలోకి ఢిల్లీ మెట్రో రైల్ రూపశిల్పి శ్రీధరన్‌ను రంగంలోకి దించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టులను రాబోయే మూడున్నరేళ్ళలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అంటే శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నది ఏపీ ప్రభుత్వ భావనగా ఉంది. 
 
కాగా, ఇప్పటికే విశాఖ, వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్‌తో భేటీ అయ్యారు. 
 
రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్‌ను కోరడంతో ఆయన దానికి సమ్మతించారు. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. మూడున్నర ఏళ్లలో రెండు మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu