Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి ఐఐటీగా వినుతికెక్కాలి : స్మృతి ఇరానీ

తిరుపతి ఐఐటీగా వినుతికెక్కాలి : స్మృతి ఇరానీ
, శనివారం, 28 మార్చి 2015 (17:02 IST)
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాకలో నెలకొల్పే ఐఐటీ తిరుపతి ఐఐటీకా వినుతికెక్కాలనీ కేంద్ర మానవవనరులశాఖామంత్రి స్మృతి ఇరానీ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా మేర్లపాకలో ఒకే చోట మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు శనివారం శంకుస్థాపన చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఇక్కడి విద్యాసంస్థలు బాగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి ఐఐటీగా ఇక్కడి విద్యాసంస్థ దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా వినుతికెక్కాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
ఈమె తన ఉపన్యాసం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రిమండలి సహచరుడు సుజనా చౌదరిలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, తన మాటలను తెలుగులోకి ఎవరైనా తర్జుమా చేయగలరా? అని కోరారు. అయితే, అందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంగ్లీషులోనే కొనసాగించారు. 
 
అనంతరం రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కల అని ఉద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, ఒకే చోటు మూడు విద్యాసంస్థలకు ఏకకాలంలో భూమి పూజ ఇదే ప్రథమమని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu