Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య రాజధాని వద్దు... ఎస్ కమిటీ షాక్

విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య రాజధాని వద్దు... ఎస్ కమిటీ షాక్
, శనివారం, 30 ఆగస్టు 2014 (21:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పడుతుందని కోట్లకు కోట్లు డబ్బులు పోసి చాలామంది రియల్టర్లు ఇప్పటికే పాగా వేశారు. ప్రభుత్వం కూడా దాదాపు ఇక్కడే కేపిటల్ సిటీని నిర్మించాలనే భావనలోకి వచ్చింది. కానీ రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మాత్రం ఈ మూడు ప్రాంతాల కలయికతో రాజధాని ఏర్పాటును తన నివేదికలో వ్యతిరేకించింది.
 
వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తున్న నేపధ్యంలో కమిటీ గట్టి షాక్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరం కాగా ఈ వీజీటి పరిధిలో కేవలం 1458 ఎకరాలే అని తన నివేదికలో పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్న భూముల ధరల ప్రకారం భూసేకరణ గుదిబండలా మారుతుందని స్పష్టం చేసింది. అందువల్ల ఇక్కడ కాకుండా మరో ఏడు మార్గాలను కూడా రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా సూచించింది. అందులో దొనకొండ ఉంది. అలాగే అమరావతి వంటి ప్రాంతాలలో అటవీ భూములున్నాయనీ, వాటిని డీనోటిఫై చేసి రాజధాని కోసం అవసరమైన భూములను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఐతే తమకు గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ఏర్పాటు కావాలంటూ ఇ-మెయిళ్లు అధికంగా వచ్చాయనీ, ఐతే ఆ ప్రదేశం మాత్రం అనువైనది కాదని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలో బాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu