Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌ళ్ళీ బుస‌కొట్టిన ఓటుకు నోటు కేసు... చంద్రబాబుకు పెద్ద షాక్...

హైద‌రాబాద్: స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకున్న ఓటుకు నోటు కేసు... మ‌ళ్ళీ బుస‌కొట్టింది. వచ్చే నెల 29 లోపు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వరంపై ఫోరెనిక్స్ రిపోర్టులో ఆ గొంతు చంద్రబాబుదేనని రిపోర్టు రావడంతో ఆ రిపో

మ‌ళ్ళీ బుస‌కొట్టిన ఓటుకు నోటు కేసు... చంద్రబాబుకు పెద్ద షాక్...
, సోమవారం, 29 ఆగస్టు 2016 (20:17 IST)
హైద‌రాబాద్: స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకున్న ఓటుకు నోటు కేసు... మ‌ళ్ళీ బుస‌కొట్టింది. వచ్చే నెల 29 లోపు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వరంపై ఫోరెనిక్స్ రిపోర్టులో ఆ గొంతు చంద్రబాబుదేనని రిపోర్టు రావడంతో ఆ రిపోర్టును పిటిషనర్ ఏసీబీ కోర్టుకు ఫోరెనిక్స్ రిపోర్టును అందించారు. 
 
మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసుపై పిటిషన్ వేశారు. చంద్రబాబు సాధారణ సమావేశాల్లో మాట్లాడిన వాయిస్ టేపులు, ఓటుకు కోటు కేసులో దొరికిన టేపుల్ని అంతర్జాతీయ ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఇది ముమ్మాటికీ చంద్రబాబు గొంతుకేనని స్పష్టమైంద‌ని స‌మాచారం. ఈ రిపోర్టులు స్వీకరించి పిటిషనర్ వాదనలు విన్న ఏసీబీ వచ్చే నెల 29 లోపు విచారణ పూర్తి చేయాలని కోరింది. గత ఏడాది మే 17 సాయంత్రం రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
 
సెప్టంబర్ 29 లోపు చంద్రబాబు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసులో ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపధ్యంలో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న చంద్రబాబుకు నోటీసులిస్తారా, విచారణకు రావాలని ఆదేశిస్తారా లేక అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొద‌లైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోవా...? యువతిని చితకబాదిన యువకులు... ఐనా చేసుకోనన్నందుకు ఆ ఘాతుకం...