Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భర్త చంపేస్తానంటున్నాడు.. రక్షించండి ప్లీజ్: ఉన్నతాధికారి

నా భర్త చంపేస్తానంటున్నాడు.. రక్షించండి ప్లీజ్: ఉన్నతాధికారి
, శుక్రవారం, 25 జులై 2014 (12:43 IST)
ఈ సమాజంలో సామాన్య మహిళలే కాదు.. ఉన్నతాధికారులుగా ఉన్న మహిళలు సైతం తమ భర్తల నుంచి వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను, తన పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నిర్మల అనే ఉన్నతాధికారి మహిళ పోలీసులను ఆశ్రయించింది. 
 
తన భర్త తన బాగు, తన పిల్లల బాగు పట్టించుకోకపోవడమే కాక ఇప్పుడు తమని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తన భర్త నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి సర్వీసుకు చెందిన గ్రూప్-1 అధికారిణి విజయనగరం జిల్లా పోలీసులను వేడుకుంది. ఆయుర్వేద డాక్టర్ అయిన తన భర్త తనను చంపేస్తాడని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను ప్రార్థిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu