Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పటేల్‌ తలచుకునివుంటే హైదరాబాద్ ఓ దేశమైవుండేది: చంద్రబాబు

పటేల్‌ తలచుకునివుంటే హైదరాబాద్ ఓ దేశమైవుండేది: చంద్రబాబు
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:04 IST)
సర్దార్ వల్లాభాయ్ పటేల్‌ను తలచుకుంటే దేశభక్తి ఉప్పొంగుతుందని, ఆయన తలచుకునివుంటే హైదరాబాద్ ఓ దేశమైవుండేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి ఉద్యోగులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. 
 
అనంతరం ప్రసంగిస్తూ, పటేల్ తలుచుకోకుంటే హైదరాబాద్ ఓ దేశమై ఉండేదని, తద్వారా, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. మొండిగా వ్యవహరించిన హైదరాబాద్ వంటి సంస్థానాలు సైతం విలీనమయ్యాయంటే అందుకు హోం మంత్రిగా పటేల్ వ్యవహరించిన కఠిన వైఖరే కారణమని బాబు తెలిపారు. హోం మంత్రిగా ఆయన దేశం గర్వపడేలా చేశారని కీర్తించారు. 
 
పటేల్‌ను తలుచుకుంటేనే దేశభక్తి ఉప్పొంగుతుందని అన్నారు. ఆ మహోన్నతుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే అందుకు కారణం పటేల్ అని స్పష్టం చేశారు. పటేల్ అంటే దేశ సమైక్యతకు మారుపేరు అని, దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu