Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణకు సానియా గర్వకారణం.. ఇదిగో బిడ్డా.. రూ.కోటి చెక్కు: కేసీఆర్

తెలంగాణకు సానియా గర్వకారణం.. ఇదిగో బిడ్డా.. రూ.కోటి చెక్కు: కేసీఆర్
, మంగళవారం, 22 జులై 2014 (14:30 IST)
టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొనియాడారు. అంతర్జాతీయ టెన్నిస్‌లో ఐదవ ర్యాంక్ ఉన్న సానియా నెంబర్ వన్ కావాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సానియాకు రూ.కోటి చెక్ అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. ప్రదీప్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే.. ఇప్పటి వరకు టెన్నిస్ క్రీడాకారిణిగా, మోడల్ కనిపించిన సానియా మీర్జా కొత్త పాత్రను పోషించనుంది. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది.ప్రయోజనాలను ప్రమోట్ చేయనుంది. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు జయేశ్ రాజన్ ధృవీకరించారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో సానియాకు ప్రభుత్వ అధికార ధృవ పత్రంతోపాటు కోటి రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu