Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరువునష్టం దావా వేస్తే ఎదుర్కొంటా: రేవంత్ రెడ్డి

పరువునష్టం దావా వేస్తే ఎదుర్కొంటా: రేవంత్ రెడ్డి
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:01 IST)
హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ స్థలాల బదలాయింపుపై తాను చేసిన ఆరోపణలపై ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.
 
తాను చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ స్థలాల బదాలాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నిం టినీ అఖిలపక్షం సమావేశంలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ వద్ద ఉంచినా తమకు సమ్మతమేనన్నారు. మెట్రో భూకేటాయింపులు, బదలాయింపుల వివాదంపై చర్చకు ఐటీ మంత్రి కెటి రామారావు ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. 
 
ఐటీఐఆర్‌లో భాగంగా రూ.350 కోట్లకు గేమింగ్‌ సిటీ కో సం సుమారు 8 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించడం ద్వారా 15వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో ఏపీఐఐసీ వీసీఎండీ జయేష్‌ రంజన్‌ ప్రకటించారని రేవంత్‌ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu