ఏపీలో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిన్యూ పవర్ సిద్ధంగా వుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ పెట్టుబడి సౌర ఇంగోట్, వేఫర్ తయారీ నుండి ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్ ఉత్పత్తి వరకు మొత్తం పునరుత్పాదక ఇంధన విలువను కవర్ చేస్తుంది.
ఈ మేరకు ఏపీలో పెట్టుబడులకు రీన్యూ పవర్ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా అతని బృందాన్ని స్వాగతిస్తూ, ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఈ చర్య ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని లోకేష్ వెల్లడించారు. హైటెక్నాలజీ పునరుత్పాదక ఇంధన తయారీకి జాతీయ కేంద్రంగా ఏపీ మారుతుందని తెలిపారు.