Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫైన్ కట్టు... అక్రమ నిర్మాణం ఫట్టూ.. క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

ఫైన్ కట్టు... అక్రమ నిర్మాణం ఫట్టూ.. క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
, శనివారం, 23 మే 2015 (06:30 IST)
అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు కట్టడాలను గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకూ ఎక్కడున్నా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరణకు నిబంధనలతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేషన్‌ అండ్‌ పీనలైజైషన్‌ ఆఫ్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్టెడ్‌ అన్‌ ఆథరైజ్డ్‌ అండ్‌ ఇన్‌ డీవీయేషన్‌ ఆఫ్‌ ది శాంక్షన్‌డ్‌ ప్లాన్‌ రూల్స్‌ 2015’ పేరుతో నిబంధనలు రూపొందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 
 
1985 జనవరి ఒకటి నుంచి 2014 డిసెంబర్‌ 31 మధ్యకాలంలో అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు, సీఆర్‌డీఏ పరిధిలో రాజధానిలో కేపిటల్‌ సిటీ ఏరియాలో కాని ఇతర ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఈ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా బీపీఎస్‌.ఏపీ.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని నోటిఫికేషన్‌లో సూచించారు. ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 27 నుంచి దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయాలన్నారు. 
 
భవనానికి సంబంధించిన యజమాని లేక, జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ లే రిజిస్టర్డు అసోషియేషన్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్‌ విడుదలైన ఆరు రోజుల్లోపు రూల్‌ 5లో సూచించిన విధంగా అపరాధ రుసుం చెల్లిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. సకాలంలో దరఖాస్తు చేసుకోకుంటే భవనం అక్రమ కట్టడంగా భావిస్తూ యజమానిపై తదుపరి చర్యలు తీసుకుంటారు. లైసెన్సెడ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ నుంచి సేఫ్టీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది. 18 మీటర్లు అంతకంటే ఎత్తు ఉన్న నివాసిత ప్రాంతాలు, 500 చ.మీ ప్రాంతంలో నిర్మించిన 15 మీటర్లు కంటే ఎత్తయిన వాణిజ్య భవనాలు, స్కూళ్లు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్ల క్రమబద్ధీకరణకు ఫైర్‌ సేఫ్టీకు సంబంధించిన క్లియరెన్స్‌లు తీసుకోవాలి. 
 
పెనాల్టీని క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ద్వారా చెల్లించవచ్చు.ఈ పెనాల్టీ మొత్తం భవనం నిర్మించిన స్థలం, అన్నీ అంతస్తులను లెక్కిస్తారు.మొదటగా దరఖాస్తుతోపాటు భవన యజమాని రూ.10 వేలు చెల్లించాలి. మిగిలిన మొత్తం 30 రోజుల్లో చెల్లించాలి. ఇలా చెల్లించిన పెనాల్టీ వాపసురాదు. తిరస్కరిస్తే 10 శాతం తగ్గించి వాపసు చేస్తారు. నోటిఫైడ్‌ మురికివాడ నివాస భవనాల విషయంలో 50ు పెనాల్టీ విఽధిస్తారు. 1997కు ముందున్న భవనాలకు 25ు పెనాల్టీలకు మినహాయింపు ఉంటుంది.
 
అక్రమ కట్టడాలను నిర్థారించిన తర్వాత అపరాధ రుసుములు ఈ విధంగా ఉన్నాయి. బేసిక్‌ పీనలైజేషన్‌ చార్జీలు 100 చ.మీ లోపు స్థలాల్లో నిర్మించిన వ్యక్తిగత నివాసిత, వాణిజ్య భవనాలకు చదరపు అడుగుకు రూ.40లు, రూ.80లు, 101-300 చ.మీ స్థలాల్లో నిర్మించిన నివాసిత ప్రాంతాల్లో రూ.60లు, రూ.120లు చెల్లించాల్సి ఉంటుంది. 301-500 చ. అడుగుల స్థలంలో నిర్మించిన కట్టడాల్లో 30 తేడాలుంటే నివాసిత, వాణిజ్య భవనాలకు వరుసగా చ.అడుగుకు రూ.80లు, రూ.160లు, 30 శాతం కంటే ఎక్కువ తేడాలుంటే రూ.100, రూ.200, 501-1000 చ.మీటర్ల భవనాల విషయంలో 30శాతం తేడాలుంటే చ.అడుగుకు రూ.100లు, రూ.200లు, 30శాతం కంటే ఎక్కువ తేడా ఉంటే చ.అడుగుకు రూ. 120లు, రూ.250లు చెల్లించాలి. వెయ్యి చ.మీ కంటే ఎక్కువ స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలకు సంబంధించి 30శాతం తేడాలుంటే నివాసిత చ.అడుగుకు రూ.150లు, వాణిజ్య భవనాలకు చ.అడగుకు రూ.300లు, 30 శాతం కంటే ఎక్కువ తేడాలుంటే చ.అడుగుకు రూ.200, రూ.400లు పెనాల్జీ చెల్లించాలి.
 

Share this Story:

Follow Webdunia telugu