Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవేత్తారు...!! పోలీసులను చూసి పరుగో పరుగు.. 40 మంది అరెస్టు

రేవేత్తారు...!! పోలీసులను చూసి పరుగో పరుగు.. 40 మంది అరెస్టు
, శనివారం, 20 డిశెంబరు 2014 (11:07 IST)
రేవ్ పార్టీ పేరుతో తైతక్కాలాడుతున్న ఓ యువకుల గుంపుపై పోలీసులు దాడి చేశారు. అడ్డం మాట్లాడిన యువకుల పని పట్టారు. వారాంతం కావడంతో ఇష్టానుసారం మందు కొడుతూ అమ్మాయిలతో కలసి డ్యాన్సులేస్తున్న వారిలో 40 మంది పట్టుకున్నారు. మరికొందరు పారిపోయారు. వారిలో పెద్దల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
 
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని  ఓ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసిన సుమారు 40మందిని అరెస్ట్ చేశారు. పదిమంది యువతులతో కలసి 30మంది ఇంజినీరింగ్ విద్యార్థులను మందు కొట్టి చిందులేస్తున్నారు. సమాచారం అందుకు పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున మద్యంతో పాటు హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదిలా ఉండగా హైదరాబాద్ ప్రాంతంలో రేవ్ పార్టీ సంస్కృతి పెరిగిపోతోంది. ఈ నెల 7న ఓ ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై  సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి.  విలాసాలకు అలవాటుపడిన యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మత్తులో జోగుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu