Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామలింగరాజు చర్లపల్లి జైల్లో ఏం చేస్తున్నారో తెలుసా?

రామలింగరాజు చర్లపల్లి జైల్లో ఏం చేస్తున్నారో తెలుసా?
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (10:46 IST)
సత్యం కుంభకోణంలో ఏడేళ్ళ జైలు శిక్ష పడిన సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈ జైల్లో ఈయన తన జైలు సమయాన్ని ఎలా గడిపేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. 
 
చర్లపల్లి జైలు వర్గాల సమాచారం మేరకు.. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉంటున్న రామలింగరాజు పుస్తకాలు చదువుతున్నారు. ఉత్థాన పతనాలను చూసిన ఆయన మౌనమునిలా పుస్తక పఠనంలో మునిగిపోతున్నారు. రోజులో 10 నుంచి 15 గంటల పాటు ఆయన రీడింగ్ రూంలోనే గడుపుతున్నారట. బయోలజీ, కెమిస్ట్రీ, సైన్స్‌‌కు సంబంధించిన పుస్తకాలను ఆయన ఎక్కువగా చదువుతున్నారని అధికారులు తెలిపారు. జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించడం లేదని, అందరిలానే అల్పాహారం, భోజనం అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
 
అయితే ఆయనకు ఇంకా ప్రత్యేక పనిని కేటాయించలేదని, సోమవారం కేటాయిస్తామని వారు వెల్లడించారు. రామలింగరాజుకు జైలులో పాఠశాల, లైబ్రరీ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే దిశగా జైలు అధికారులు ఆలోచిస్తుండగా, ఆయన మాత్రం లైబ్రరీ ఇన్‌ చార్జీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మూడేళ్ల జైలు జీవితం పూర్తి చేసిన రామలింగరాజు మరో నాలుగేళ్లు జైలులో గడపనున్నారు. ఆయన ఇలాగే ఉంటే సత్ప్రవర్తన కారణంగా ఏడాది శిక్షాకాలం తగ్గే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu