Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం... కూలిన చెట్లు.. ఎగిరిన పైకప్పులు...

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం... కూలిన చెట్లు.. ఎగిరిన పైకప్పులు...
, శుక్రవారం, 6 మే 2016 (09:25 IST)
హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, వనస్థలిపురం, సహారా ఎస్టేట్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, తార్నాక వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. గత రెండు,మూడు రోజులుగా అక్కడక్కడ చినుకులతో కూడిన వర్షం కురుస్తుండగా, నిన్నగాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం మొత్తం జలమయంగా మారింది. వర్షం ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఈదురుగాలి వీచడంతో ఇంటిపైకప్పులు సైతం లేచిపోయాయి. 
 
రామాంతపూర్ చర్చికాలనీలో మురుగునీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పార్శిగుట్ట, చిలకలగూడ, అడ్డగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో భారీవర్షం పడింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లాలోని పలుమండలాల్లో భారీగా వర్షం కురిసింది. 
 
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలకి ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరవధిక దీక్షలో కన్హయ్య.. మరింత క్షీణించిన ఆరోగ్యం