Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఖాయం: 15, 16 తేదీల్లో అనంతలో టూర్

రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఖాయం: 15, 16 తేదీల్లో అనంతలో టూర్
, ఆదివారం, 5 జులై 2015 (10:46 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ టూర్ కానుంది. ఈ నెల 15,16 తేదీల్లో ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.  ఈ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు. అంతేకాకుండా రైతు కూలీలు, వలస కూలీలతోనూ రాహుల్ గాంధీ మాట్లాడుతారు. 
 
ఇదివరకే రైతు సమస్యలపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ, తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తన పర్యటనకు అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో ఏపీలోనూ ఈ తరహా పర్యటన చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఓబులదేవ చెరువు, నల్లమడ మండలాల్లో 15 కి.మీ మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu