Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల మోత‌! స‌ర్కారు బ‌డుల మూత‌!!

విజ‌య‌వాడ‌: విద్య నేడు అతి పెద్ద వ్యాపార వ‌స్తువుగా మారిపోయింది. ఎల్‌కె‌జి నుంచి పీజీ వ‌ర‌కు గ‌తంలో వేల రూపాయ‌ల ఫీజుల‌తోనే విద్యాభాస్యం పూర్తి చేసేవారు. కానీ, ఇపుడు ఒక్క ఎల్.కె.జీకే కార్పొరేట్ పాఠ‌శాల‌ల్లో ల‌క్ష‌ల ఫీజులు గుంజుతున్నారు. తాజాగా ఇపుడు

ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల మోత‌! స‌ర్కారు బ‌డుల మూత‌!!
, సోమవారం, 23 మే 2016 (19:17 IST)
విజ‌య‌వాడ‌:  విద్య నేడు అతి పెద్ద వ్యాపార వ‌స్తువుగా మారిపోయింది. ఎల్‌కె‌జి నుంచి పీజీ వ‌ర‌కు గ‌తంలో వేల రూపాయ‌ల ఫీజుల‌తోనే విద్యాభాస్యం పూర్తి చేసేవారు. కానీ, ఇపుడు ఒక్క ఎల్.కె.జీకే కార్పొరేట్ పాఠ‌శాల‌ల్లో  ల‌క్ష‌ల ఫీజులు గుంజుతున్నారు. తాజాగా ఇపుడు ప్రైవేటు పాఠశాలల ఫీజులు రెట్టింపయ్యాయి. ప్ర‌భుత్వం టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ లాంటి పేర్లను రెండేళ్ల కిందట తొలగించినా, ఫీజుల్లో మాత్రం ఎలాంటి త‌గ్గింపు లేదు. మరో వారం రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 
 
ఎలాగైనా సరే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది పిల్లల కోసం వీధివీధీ, ఇళ్లిళ్లూ తిరుగుతూ అడ్మిషన్ల ప్రక్రియలో తలమునకలవుతున్నాయి. దొరికిన విద్యార్థిని దొరికిన‌ట్లు బుట్ట‌లో వేసి, భారీగా ఫీజులు దండుకుని ప్ర‌యివేటు కాన్వెంట్లు నింపుకొనే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. కానీ, ఇటు చూస్తే, పాపం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు బ‌క్క చిక్క‌పోతున్నాయి. విద్యార్థుల సంఖ్య స‌రిగా లేద‌ని, ఏపీలో ఇప్ప‌టికే 400 పాఠ‌శాల‌ల్నిమూపివేశారు. రేష‌న‌లైజేష‌న్ పేరుతో ఉన్న విద్యార్థుల‌ను, ఉపాధ్యాయుల్ని అన్ని పాఠ‌శాల‌ల‌కు స‌ర్దుతున్నారు. 
 
ఇపుడు కొత్త విద్యా సంవత్స‌రం మొద‌లు కాక‌ముందే... ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు పోటీలు ప‌డి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను కోడి పెట్ట‌ల్లా త‌న్నుకుపోతుంటే, ప్ర‌భుత్వం చోద్యం చూస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికారులు ఏమాత్రం ఏమరపాటు వహించినా పిల్లలు లేరనే సాకుతో మరోసారి మ‌రిన్ని సర్కారు బడులు మూతపడే ప్రమాదముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓడిపోయినా.. ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పిన వానతి శ్రీనివాసన్..!