Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ డ్రామా.. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా.. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పుతో కొట్టుకున్నారు..!

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండో సారీ వాయిదా పడడంతో తీవ్రంగా నిరసన తెలిపిన శివప్రసాద్ రెడ్డి.. తనను

Advertiesment
Poddutur
, ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:25 IST)
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండో సారీ వాయిదా పడడంతో తీవ్రంగా నిరసన తెలిపిన శివప్రసాద్ రెడ్డి.. తనను తాను చెప్పుతో కొట్టున్నారు. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఈ అరాచక ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేగా కొనసాగలేను. తక్షణమే ఈ పదవికి రాజీనామా చేస్తున్నానని శివప్రసాద్ రెడ్డి అన్నారు. 
 
కడప జిల్లా ప్రొద్ధుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు తెలుగుదేశం పార్టీ తిరిగి డ్రామా ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ పోలీసులు, ఆర్డీవో ఎదుటే శివప్రసాద్ రెడ్డి చెప్పుతో కొట్టుకోవడం  చర్చకు దారితీసింది. 
 
కడప జిల్లా ప్రొద్ధుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో  చైర్మన్ పదవికి పోటీలో ఉన్న తమ మద్దతుదారుడు ముక్తియార్‌కు 27 మంది కౌన్సిలర్ల సపోర్టు ఉన్నా నియోజకవర్గ ఇంచార్జి వరదరాజుల రెడ్డి అనవసర రాద్ధాంతాలు చేసి ఎన్నిక వాయిదా పడేలా చూశారని ప్రసాద రెడ్డి ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనం చేసిన వ్యక్తి మత్తులో ఉన్నాడనుకుంది.. ప్రియుడి కోసం పెరట్లోకి వెళ్లింది.. చంపేశాడు?!