Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలేశుని రెండుసార్లు దర్శించుకున్న పవన్ కళ్యాణ్... ఏం కోరుకున్నారబ్బా...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తిరుపతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు తొలి ఎన్నికల్లో తిరుపతి నుండే పోటీ చేశారు. 2008 ఆగస్టు 26న పవన్‌ సోదరుడు చిరంజీవి అదే తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాట

తిరుమలేశుని రెండుసార్లు దర్శించుకున్న పవన్ కళ్యాణ్... ఏం కోరుకున్నారబ్బా...?
, శనివారం, 27 ఆగస్టు 2016 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తిరుపతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు తొలి ఎన్నికల్లో తిరుపతి నుండే పోటీ చేశారు. 2008 ఆగస్టు 26న పవన్‌ సోదరుడు చిరంజీవి అదే తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన తొలి ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత కొంత కాలంగా పొలిటికల్‌గా మౌనంగా ఉన్న పవన్‌.. బహిరంగ సభను తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 27న నిర్వహించనుండటం చర్చనీయాంశంగా మారింది.
 
అన్నయ్య చిరంజీవి సభ జరిగిన సరిగ్గా ఏడేళ్ళకు ఆ రోజుకు(ఆగస్టు 26) ఒక్కరోజు తర్వాత(ఆగస్టు 27) తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలోనే సభ నిర్వహించాలనుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతిలో పవన్ మూడు రోజులుగా బస చేసి ఉన్నారు. పవన్ రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.  తిరుపతి నియోజకవర్గ వివరాలు సమీకరించుకోవడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి తిరుపతి బహిరంగ సభనే వేదికగా చేసుకోవడం... ఇవన్నీ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ఫ్యాన్ వినోద్ హత్య.. సందిగ్ధంలో పడిన జూనియర్ ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్‌పై..?