Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిమ్‌ కొంటే ఉల్లి ఫ్రీ... క్యా ఐడియా సర్ జీ...ఎలా..? ఎక్కడ?

సిమ్‌ కొంటే ఉల్లి ఫ్రీ... క్యా ఐడియా సర్ జీ...ఎలా..? ఎక్కడ?
, గురువారం, 27 ఆగస్టు 2015 (07:06 IST)
వ్యాపారం చేసుకునేందుకు రకరకాల మార్గాలు... తమ చుట్టుపక్కల జరిగే మార్పులను వ్యాపారానికి అనుగుణంగా మార్చుకునే తెలివితేటలు ఉండాలేగానీ, దేనినైనా అమ్మేయవచ్చునని మరోమారు నిరూపించాడు ఓ వ్యక్తి. ఉల్లి కొరతను తన వ్యాపారానికి అనుగుణంగా మార్చేసుకున్నాడు. ఒక సిమ్‌ కొంటే ఇంకో సిమ్‌ ఫ్రీ! అనే బ్యానర్ పెట్టాడు. అబ్బే లాభం కనిపించలేదు. అదే సిమ్‌ల విక్రయాన్ని ఉల్లికి లింకు పెట్టాడు. ఇక అంతే ... ఒక్కటే సెల్స్ ఎక్కడ? 
 
ఒక ఐడియా అమ్మాలనే మార్చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి  ‘ఐడియా త్రీజీ సిమ్‌ కొనుగోలు చేస్తే...కిలో ఉల్లిపాయలు ఉచితం’ అంటూ బుధవారం వాట్సప్‌లో ఫొటో హల్‌చల్‌ చేసింది. పైగా దీనిని దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తాలో ఏర్పాటుచేశారంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చాయి.  అసలే ఉల్లి కొనలేక కష్టాలు పడుతున్న వారు ఈ ‘ఫ్రీ’ ప్రకటనను చూడగానే వెంటనే సిమ్‌ను కొనుగోలు చేసేందుకు స్టాల్‌ కోసం వెతకడం మొదలుపెట్టారు. అక్కడ అమ్మకాలు కూడా జోరుగా సాగాయట. 

Share this Story:

Follow Webdunia telugu