Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓబులేష్ రిమాండ్‌కు తరలింపు: 14 రోజులు రిమాండ్.. డిసెంబర్ 3 వరకు..

ఓబులేష్ రిమాండ్‌కు తరలింపు: 14 రోజులు రిమాండ్.. డిసెంబర్ 3 వరకు..
, శనివారం, 22 నవంబరు 2014 (17:31 IST)
ఓబులేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన ఓబులేష్‌ను తొలుత నాంపల్లి పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. 
 
అతన్ని విచారించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్‌ డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంటాడు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఓబులేష్‌ను పోలీసులు విచారించినప్పుడు కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. 
 
అతను అంతకుముందు తుపాకీని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దాచాడు. గ్రేహౌండ్స్ అధికారులు ఆయుధాలు రికవరీ చేసిన సమయంలో అతడు తన జాకెట్ కోటులో ఏకే 47 ఆయుధాన్ని పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ సెలబ్రటీని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని కేబీఆర్ పార్క్ వద్ద రెండోసారి ఉపయోగించాడు.
 
కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేష్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఎకె 47 రైఫిల్‌ను, బుల్లెట్లను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. 
 
కాగా నిత్యానంద రెడ్డిపై ఓబులేష్ ఎందుకు దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు, ఎలా పారిపోయాడనే విషయాలను కూడా ఓబులేష్ వివరించాడు.

Share this Story:

Follow Webdunia telugu