Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురు పుట్టిందని భార్యాపిల్లలను వదిలేసి అమెరికా వెళ్లిపోయిన భర్త!

కూతురు పుట్టిందని భార్యాపిల్లలను వదిలేసి అమెరికా వెళ్లిపోయిన భర్త!
, గురువారం, 26 మే 2016 (10:20 IST)
కూతురు పుట్టిందనే కోపంతో భార్యాబిడ్డలను వదిలివేసి ఓ ఎన్.ఆర్.ఐ భర్త అమెరికాకు వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్ జిల్లా కానాపూర్ సమీపంలోని తలకొండపల్లికి చెందిన వెంకటపద్మ నారాయణరెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన భగవంత్‌ రెడ్డి కుమార్తె అర్చనను అతడికి ఇచ్చి 2011లో పెళ్లి జరిపించారు. వీరికి 2012 ఆగస్టులో కూతురు జన్మించింది. 
 
ఆడపిల్ల పుట్టిందనే కోపంతో దుర్భాషలాడుతూ భర్త వెంకటపద్మ నారాయణరెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు స్వదేశానికి తిరిగిరాలేదు. భార్య అర్చన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించడం లేదు. దీంతో పాటు అత్తామామలు జగత్‌రెడ్డి, పుష్పలతలు 'నా కొడుక్కి మీరు అక్కర్లేదు' అని ఇంటినుంచి గెంటేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ మహిళ తల్లిదండ్రులు...తన కుమార్తెకు రక్షణ కల్పించి, న్యాయం చేయమని కోరుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్డ్‌కాల్‌తో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం.. ఆపై గ్యాంగ్ రేప్.. కర్ణాటకలో దారుణం!