Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫా? నో.. నో..!: చినరాజప్ప

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫా? నో.. నో..!: చినరాజప్ప
, బుధవారం, 23 జులై 2014 (13:44 IST)
ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ లేదని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సిబ్బంది కొరత కారణంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లేనట్లేనని స్పష్టమైంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ఏపీ పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం కుదరదని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. 
 
అయితే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చినరాజుప్ప తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదేగానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందనే చూడాదన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో పాటు సిబ్బంది కొరతతో ప్రస్తుత పరిస్థితుల్లో వీక్లీ ఆఫ్ ఇవ్వడం సరికాదని, నెలరోజుల్లో పోలీసు శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu