Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీబీఐకు ప్రత్యేక అధికారాలేమి ఉండవు.. శేషాచల ఎనకౌంటర్ పై హై కోర్టు వ్యాఖ్య

సీబీఐకు ప్రత్యేక అధికారాలేమి ఉండవు.. శేషాచల ఎనకౌంటర్ పై హై కోర్టు వ్యాఖ్య
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (08:19 IST)
సీబీఐ అధికారులేమీ ఉండవనీ, వారికీ, రాష్ట్ర పోలీసులకేమీ తేడా ఉండదనీ, కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారన్నది ముఖ్యం కాదని, ఎంత నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు చేస్తున్నారన్నదే ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలన్న వాదనపై శుక్రవారం కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగలరని చెప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేస్ డైరీని పరిశీలించిన తరువాతే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. శేసాచల ఎన్ కౌంటర్ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీబీఐ దర్యాప్తు గురించి ప్రస్తావించగా పై వ్యాఖ్యలు చేసింది.
 
కేస్ డైరీని తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది.  ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం ఏఏజీ శ్రీనివాస్ కోర్టుకు తెలియజేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu