Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహితను లైంగికంగా వేధించిన టీడీపీ కార్యదర్శిపై నిర్భయ కేసు

వివాహితను లైంగికంగా వేధించిన టీడీపీ కార్యదర్శిపై నిర్భయ కేసు
, సోమవారం, 24 ఆగస్టు 2015 (12:31 IST)
ఓ వివాహితను లైంగికంగా వేధించడంతో పాటు చంపుతానని బెదిరిస్తూ వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్యదర్శి, గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్‌కు చెందిన అమరం వినోద్‌పై నిర్భయ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని దోమలగూడ రిలయన్స్ అపార్ట్‌మెంట్లో ఉంటున్న ఓ వివాహిత,  గాయకురాలైన మహిళతో వినోద్‌కు ఫైనాన్స్ విషయంలో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది.  
 
అప్పటి నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, ఈ మధ్య విభేదాలు రావడంతో మాట్లాడుకోవట్లేదని, దీంతో ఆమెను వినోద్ లైంగికం వేధించడం మొదలెట్టాడని ఇన్ స్పెక్టర్ ఎన్ఎల్ ఎన్ రాజు తెలిపారు. వేధింపులే కాకుండా చంపేస్తానని బెదిరిస్తున్నాడని సదరు మహిళ వినోద్‌పై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే అతనిపై నిర్భయ కేసు నమోదు చేశామని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu