Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంతైనా మహానటుడు ఎన్టీఆర్ మనవరాలు కదా... అందుకే...

తమిళనాడుని, పరోక్షంగా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన 2జి కుంభకోణం కావచ్చు... లాలూగారి దాణా కావచ్చు... భారీస్థాయి కుంభకోణాలకు మాత్రమే కాదు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. కరుణానిధి, లాలూ కుటుంబంలోనే కాదు, తెలంగాణలోని కెసిఆర్ కుటుంబంలోనూ, ఉత్

ఎంతైనా మహానటుడు ఎన్టీఆర్ మనవరాలు కదా... అందుకే...
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (19:00 IST)
తమిళనాడుని, పరోక్షంగా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన 2జి కుంభకోణం కావచ్చు... లాలూగారి దాణా కావచ్చు... భారీస్థాయి కుంభకోణాలకు మాత్రమే కాదు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. కరుణానిధి, లాలూ కుటుంబంలోనే కాదు, తెలంగాణలోని కెసిఆర్ కుటుంబంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోని ములాయం కుటుంబంలోనూ మంత్రులకు, ఎంపిలకు కొదవే లేదు. ఇప్పుడు కొందరు మాజీలే కావచ్చులెండి.
 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహాకు బాబు తెరతీయవచ్చనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వియ్యంకుడు, బావమరిది నటసింహ బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటుకుని ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఎమ్మెల్సీ కోటాలో చంద్రబాబు తనయుడు లోకేష్ మంత్రి పదవిని సైతం అలంకరించేసారు. ఇప్పుడిక తాజాగా బ్రాహ్మణి వంతు వస్తుందని, పార్టీలో కీలక పదవితో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి ఏ మంత్రిగిరో కట్టబెట్టవచ్చు అని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
 
వాగ్ధాటి, వాక్చాతుర్యం ఇత్యాది విషయాల్లో ఇప్పటికే నారా లోకేష్‌పై రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ విమర్శలు వెల్లువెత్తిన సందర్భంలో, సరైన సమయంలో నారా బ్రాహ్మణిని లాంఛ్ చేయాలనుకుంటున్నారట బాబు. ఆమె ఇప్పటికే పలు వేదికల్లో చేసిన ప్రసంగాల్లో తన భర్త కంటే ఎంతో బెటర్ అని ప్రూవ్ చేసేసుకుంది. ఎన్టీఆర్ మనవరాలనే ట్యాగ్ లైను ఎలానూ ఉంది. ఏది ఏమైనా, నారా బ్రాహ్మణి ఎంట్రీ కోసం తెదేపా శ్రేణులే కాకుండా, యావత్ ఆంధ్రరాష్ట్రంలోని ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మరో కుటుంబ పాలనకు నాంది పలికినట్లే అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెకి ఎయిడ్స్ వుంది... కానీ మిస్ బ్యూటీ క్వీన్ అయింది... ఎలా?