Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుపై రోజా ఫైర్ : ఇదేనా మహిళల రక్షణ? అంటూ ప్రశ్న

చంద్రబాబుపై రోజా ఫైర్ : ఇదేనా మహిళల రక్షణ? అంటూ ప్రశ్న
, బుధవారం, 5 ఆగస్టు 2015 (16:48 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళల రక్షణకు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం ఆ వాగ్ధానాలన్నింటినీ గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
 
అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీలపై పోలీసులతు దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇదేనా మహిళల రక్షణ? అంటూ రోజా ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల సమయంలో 27 మంది, నాగార్జున వర్శిటీలో రుషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని బాబు విలాసాల కోసం టర్కీ పర్యటనకు వెళ్లారని నిప్పులు చెరిగారు.

Share this Story:

Follow Webdunia telugu