Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్‌ బాలికతో పెళ్లికి సన్నాహాలు.. విడిపించిన హైదరాబాద్ పోలీసులు..అరబ్‌ షేక్‌ అరెస్ట్‌.

మైనర్‌ బాలికతో పెళ్లికి సన్నాహాలు.. విడిపించిన హైదరాబాద్ పోలీసులు..అరబ్‌ షేక్‌ అరెస్ట్‌.
, సోమవారం, 3 ఆగస్టు 2015 (10:41 IST)
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని బాలిక తల్లిదండ్రులకు నజరానా ఇచ్చాడో షేక్... వారి కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడానికి తయారయిపోయాడు. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయట పడింది. అరబ్‌ షేక్‌ నుంచి బాలికను విడిపించిన సంఘటన సోమవారం పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. మైనర్‌ బాలికను వివాహమాడేందుకు యత్నించిన అరబ్‌షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఉమాన్‌ దేశానికి చెందిన బదర్‌ యూసుఫ్‌ అల్‌ బ్లూషీ(37) అనే వ్యక్తి గత నెల 18న హైదరాబాద్‌కు వచ్చాడు. పాతబస్తీలోని ఫత్తర్‌ క మకాన్‌ సమీపంలో 17 ఏళ్ల బాలికతో సోమవారం వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. 
 
మరికొన్ని గంటల్లో వివాహం జరుగుతుందనగా సమాచారం అందుకున్న రెయిన్‌ బజార్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన అరబ్‌ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu