Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసిన పోలీసులు

అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసిన పోలీసులు
, మంగళవారం, 28 జులై 2015 (12:46 IST)
హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ పరిధిలో అక్కాచెల్లెళ్లను పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది అమిత్ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీలేఖను ప్రేమిస్తున్నానని వెంటబడ్డ అమిత్ సింగ్, తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా ఈ నెల 14న ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన శ్రీలేఖ సోదరి యామినిపైనా అతడు కత్తితో దాడికి దిగాడు. 
 
ఈ దాడిలో అక్కాచెల్లెల్లిద్దరూ మృతి చెందారు. యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాదు ఎస్ఓటీ పోలీసులు మంగళవారం ఉదయం అమిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. కాగా హైదరాబాద్ కొత్తపేటలో ప్రేమించ లేదనే అక్కసుతో అమ్మాయిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న చెల్లెలిపై కూడా అమిత్ సింగ్ దాడికి పాల్పడ్డాడు. ఎవ్వరూలేని సమయంలో యామిని ఇంట్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా తెగనరికాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu