Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మ‌ళ్ళీ టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్... మ‌ల్లాది విష్ణు రెడీనా...

విజ‌య‌వాడ‌ : కృష్ణా పుష్క‌రాల హ‌డావుడి ముగిసింది. ఇక ఏపీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కి తెలుగుదేశం తెర లేపుతోంది. అయితే ఈసారి వైసీపీతో పాటు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ మీద కూడా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్నంతా యువనేత లోకేష్ చూసుకు

ఏపీలో మ‌ళ్ళీ టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్... మ‌ల్లాది విష్ణు రెడీనా...
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:40 IST)
విజ‌య‌వాడ‌ : కృష్ణా పుష్క‌రాల హ‌డావుడి ముగిసింది. ఇక ఏపీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కి తెలుగుదేశం తెర లేపుతోంది. అయితే ఈసారి వైసీపీతో పాటు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ మీద కూడా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్నంతా యువనేత లోకేష్ చూసుకుంటున్నారు. కేవీపీ ప్రైవేట్ బిల్లు తరువాత కాంగ్రెస్ గొంతు పెరగడం చూసిన టీడీపీ తాజా వ్యూహానికి శ్రీకారం చుట్టింది.
 
ఇందులో భాగంగా ముందుగా రాజధాని ప్రాంతంలో బలంగా కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా శిష్యుడు మల్లాది విష్ణుపై కన్నేసింది. ఇప్పటికే బార్‌లో మద్యం కల్తీ కేసులో చిక్కుకున్న విష్ణుపై అనుచరులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అదే టైంలో దేశం శ్రేణుల నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఓ మాజీ ఐఏఎస్, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు నిర్వహించి.. ప్రస్తుతం ఓ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. విష్ణుది, ఆయనది ఒకే సామాజికవర్గం కావడం కూడా కలిసొచ్చిందట.
 
ముందస్తు చర్చలు ఫోన్‌లో అయ్యాక లోకేష్‌తో నేరుగా విష్ణు గన్నవరంలో సమావేశం అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీలో విష్ణు ముఖ్య అనుచరులు, సహచరులు కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. వీరిలో శివాజీ ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధి కాగా.. నరసింహారావు పీసీసీ కార్యదర్శిగా వున్నారు. రాజకీయ భవిష్యత్ పైన లోకేష్ వీరికి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్యులు త్వరలో దేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కాక‌... మ‌రో నలుగురు వైసీసీ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ నటి.. మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు .. వచ్చే వారంలో వాదనలు