Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 చాఫ్టర్లతో సిఆర్ డిఏ బిల్లు.. సభలో ప్రవేశపెట్టిన యనమల

17 చాఫ్టర్లతో సిఆర్ డిఏ బిల్లు.. సభలో ప్రవేశపెట్టిన యనమల
, శనివారం, 20 డిశెంబరు 2014 (21:13 IST)
కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభలో  ప్రవేశపెట్టారు. 17 చాప్టర్లుగానూ, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు. మూలధనం ఎంతుండాలి. బిల్లులోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయనే అంశాలను పొందు పరిచారు. 

సీఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణకు స్పెషల్ కమిషనర్ను నియమిస్తారు. ల్యాండ్ పూలింగ్ బాధ్యతను కూడా సీఆర్డీఏకే అప్పగించారు.12,050 కోట్ల రూపాయలతో మూల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. 
 
ప్రధానంగా రాజధాని డెవలప్మెంట్ ప్లాన్, రాజధాని ప్రాంతపరిధిలోకి వచ్చే గ్రామాలు బిల్లులో వివరించారు. రాజధాని ప్రాంత భవిష్యత్ కోసం ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
 
ఈ బిల్లుపై సోమవారం చర్చ జరుగుతుంది. అనంతరం ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ దగ్గరకు వెళ్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.  గవర్నర్ ఆమోదం పొందిన తరువాత  భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి యనమల తెలిపారు. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, మంగళగిరి మండలాలలో రాజధానిని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసింది. ఈ సిఆర్డియే పరిధిలోకి 77 కిలో మీటర్ల ప్రాంతం వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu