Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాను తవ్వుకున్న గోతిలో తానే పడిన టీఆర్ఎస్ సర్కారు: ఎల్. రమణ

తాను తవ్వుకున్న గోతిలో తానే పడిన టీఆర్ఎస్ సర్కారు: ఎల్. రమణ
, శుక్రవారం, 31 జులై 2015 (11:47 IST)
తెలంగాణ ప్రభుత్వం తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని.. ఫోన్ ట్యాపింగ్‌కు మూల్యం చెల్లించక తప్పదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ సర్కారు తడబడుతోందని ఆత్మరక్షణలో పడిపోయిందని రమణ వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో సాక్షాత్తు తెలంగాణ కేసీఆరే తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. తాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదంటూ గతంలో టీఆర్ఎస్ నేతలంతా ఊదరగొట్టేశారని... ఇప్పుడేమో కోర్టులోనే ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మే 23వ తేదీ నుంచే టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కాల్ డేటా ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాదిస్తోందని ప్రశ్నించారు.
 
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని కేసీఆర్‌కు భయం ఆవహించిందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదని జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు.

సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికతో జగన్‌లోనూ, కేసీఆర్ లోనూ భయం నెలకొందని తెలిపారు. కుట్ర ఫలితంగా జగన్, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu