Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెజ‌వాడ‌లోనే కాదు... కృష్ణానది చాలా చోట్ల ఉంది... పుష్కర స్నానం ఎక్కడైనా...

విజ‌య‌వాడ‌ : కృష్ణా పుష్కరాలు ఆగష్టు 12 నుంచి ప్రారంభమ‌వుతున్నాయి. ఈసారి యాత్రీకులందరూ విజయవాడలోనే పుష్కర స్నానాలు చేయటం సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా రహదారి ప్రయాణాలు చేసే వారు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం. విజయవా

బెజ‌వాడ‌లోనే కాదు... కృష్ణానది చాలా చోట్ల ఉంది... పుష్కర స్నానం ఎక్కడైనా...
, మంగళవారం, 26 జులై 2016 (19:38 IST)
విజ‌య‌వాడ‌ : కృష్ణా పుష్కరాలు ఆగష్టు 12 నుంచి ప్రారంభమ‌వుతున్నాయి. ఈసారి యాత్రీకులందరూ విజయవాడలోనే పుష్కర స్నానాలు  చేయటం సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా రహదారి ప్రయాణాలు చేసే వారు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం. విజయవాడలో గత సంవత్సరం నుండి జరుగుతున్న ఫ్ల‌ైవోవ‌ర్ మరియు రహదారి మరమ్మతు పనులు ఇంతవరకు ఒక కొలిక్కి  రాలేదు. 
 
ఎన్నేళ్ళు పడుతుందో ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం అసాధ్యం. ఈ ఏడాది అంతా హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు మరో రెండు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని తీవ్ర అసౌకర్యానికి లోనై తిట్టుకుంటూ, పసిపిల్లలతో తీవ్ర అవస్తల పాలవుతూ, ప్ర‌యాణాలు చేస్తున్నారు. అలాంటిది  పుష్కరాల సమయంలో పట్టే ఆలస్యాన్నిమనం ఊహించగలమా? చాలా అవస్తల పడాల్సి వస్తుంది. 
 
దీనికి ఒక‌టే త‌రుణోపాయం. పుష్కర స్నాన ఫలితం ఏ పరీవాహక ప్రాంతంలో చేసినా వస్తుంది. విజయవాడలోనే చెయ్యాలన్న నియమం పెట్టుకోవద్దు. ముఖ్యంగా హైదరాబాదు వైపు నుండి వచ్చేవారు... విజయవాడలో దిగే ప్రయత్నం చేసే కంటే తెనాలిలో దిగితే బస్టాండు వద్ద మంచి హోటల్స్ బ‌స చేసే సౌకర్యాలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకుని వల్లభాపురం, గాజుల్లంక, చిలుమూరు ఇత్యాది కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో హాయిగా పుష్కర స్నానం చేసుకొని దైవదర్శనం కూడా చేసుకోవచ్చు. రేపల్లెకు హైదరాబాదు నుండి రైలు సౌకర్యం ఉంది.
 
చక్కగా రేపల్లె వెడితే రేపల్లెలో ఇప్పుడు మంచి హోటల్స్ వసతి సౌకర్యాలు ఉన్నాయి. పెనుమూడి రేవులో స్నానం చేసుకొని మోపిదీవి సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును, అడవుల దీవి, మోర్తోట, హంసల దీవి, ఇలా ఎన్నోచారిత్రాత్మక పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
 
ఇదంతా కృష్ణా నది పరీవాహిక ప్రాంతం సంగమ ప్రదేశం. పరమ పవిత్రం. పుష్కరాలు మొదటి రోజునే అదీ పుష్కరుడు ప్రవేశించబోయే సుముహూర్త సమయంలోనే పుష్కర స్నానం చెయ్యాలనే మూఢ న‌మ్మకాలు వదిలేయండి. ఆ పుష్కరాలు 12 రోజులలో ఎక్కడ చేసినా ఏ ప్రాంతంలో స్నానం చేసినా, సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. అనవసరమైన మూఢ నమ్మకాలతో మీరు అవస్తలపాలై మీ కుటుంబ సభ్యులను పసిపిల్లలను చిన్నారులను అవస్తలపాలు చేయవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 వేల కోళ్లు, 300 మేకలు బలి... ఘాటు బిర్యానీ... చెన్నై షోలింగనల్లూర్ ఎమ్మెల్యే విందు భోజనం...