Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌కు అక్షయ పాత్ర ఆహారం, వచ్చినవారందరికీ భోజనం...

అమరావతి : కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌కు అక్షయ పాత్ర, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అత్యంత నాణ్యమైన ఆహారం అందిస్తామ‌ని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యాత్రికుల

కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌కు అక్షయ పాత్ర ఆహారం, వచ్చినవారందరికీ భోజనం...
, సోమవారం, 25 జులై 2016 (12:30 IST)
అమరావతి : కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌కు అక్షయ పాత్ర, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అత్యంత నాణ్యమైన ఆహారం అందిస్తామ‌ని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యాత్రికులకు అందించే సేవా కార్యక్రమాలపై ప్రధాన సమీక్ష నిర్వ‌హించారు. 
 
అక్షయ పాత్ర, తిరుమల తిరుపతి దేవస్థానం ఆహారం అందించేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని, ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా నాణ్యమైన ఆహారం అందించేందుకు ముందుకు రావాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటకాలను యాత్రికులకు రుచి చూపించాల‌న్నారు. అతిథులు అబ్బురపడేలా ఏర్పాట్లు ఉండాల‌ని, ఫుడ్ కోర్టులలో కేవలం ఆంధ్రప్రదేశ్ వంటకాలే కాకుండా అన్ని రాష్ట్రాల వంటకాలు పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించాలని, ఆదరించాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని విజయవాడ నగర పౌరులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 
 
రెండు రోజుల్లో సీఎం ప్రజలనుద్దేశించి  ప్రసంగించనున్నారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాల‌ని, పుష్కరాలు జరిగే 12 రోజులూ కృష్ణా నదిలో జల క్రీడలు నిర్వహిస్తామ‌ని, అన్ని రకాల బోట్లు, ఏసీ బోట్లు, క్రూయిజ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తల్లి నుంచి రూ.6.3 లక్షలకు అమ్ముడుపోయిన మైనర్ బాలిక: ఆపై రూ.15 లక్షలకు..?