NARI: మహిళల భద్రత.. నారి 2025 నివేదికలో విశాఖపట్నానికి అరుదైన ఘనత

సెల్వి
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (09:04 IST)
Visakhapatnam
మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన వార్షిక నివేదిక, సూచిక (నారి) 2025లో విశాఖపట్నం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 31 ప్రధాన నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 
 
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా విశాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సర్వేలో దేశవ్యాప్త భద్రతా స్కోరు 65 శాతంగా నమోదు కాగా, విశాఖపట్నం పనితీరు జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ గుర్తింపుపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏ మహిళకైనా పోలీస్ స్టేషన్ స్థాయిలో న్యాయం జరగకపోతే, వారు నేరుగా తనను సంప్రదించవచ్చని కమిషనర్ భరోసా ఇచ్చారు. 
 
నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో నిరంతరం ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.  డ్రోన్లతో నిఘా, కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక షీ టీమ్స్ వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments