Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి..? సీమాంధ్రలో పాగా వేసేందుకట...

బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి..? సీమాంధ్రలో పాగా వేసేందుకట...
, శుక్రవారం, 25 జులై 2014 (19:23 IST)
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి కిరణ్ సన్నిహిత వర్గాలు. ఎన్నికల వేళ తనకు తానే సమైక్య ఛాంపియన్‌గా చెప్పుకున్నారు కిరణ్. ఫలితాల తర్వాత ఘోరంగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఓ జాతీయ పార్టీలోకి మారేందుకు రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ నల్లారి!
 
ఆగస్టు మొదటి వారంలో బీజేపీలో చేరిక..? 
కొన్నాళ్లుగా బెంగుళూరులో ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో ప్రధాని మోడీని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్‌నాథ్‌సింగ్, నితీష్ గడ్కరీలతో నల్లారి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే నెల మొదటి వారంలో మోడీని కలిసి.. ఆ తర్వాత పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేస్తారని కిరణ్‌ సన్నిహితులే చెబుతున్నారు. ఇక బీజేపీ నాయకుల వాదన మరోలా ఉంది. తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామంటున్నారు. అయితే కిరణ్‌ చేరికపై తమకు ఎటువంటి సమాచారం ఢిల్లీ పెద్దల నుంచి అందలేదంటున్నారు.
 
మీడియాకు దూరంగా నల్లారి 
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి పార్టీలో అందలమెక్కించిన అధిష్టాన నిర్ణయాన్నే తప్పుబట్టారు కిరణ్. చివరకు సీఎం పదవికే రాజీనామా చేసి, పార్టీ నుంచి వేరుపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల ముందు జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికల ఫలితాల్లో బోర్లా పడ్డారు. ఆ తర్వాత నల్లారి కిరణ్‌ మీడియా ముందు కనిపించలేదు.
 
ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్‌ 
మరోవైపు ఏపీలో కాంగ్రెస్‌ కుదేలు కావడంతో ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. కిరణ్‌ను పార్టీలోకి తీసుకుని పదవీబాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కొందరు నేతలు అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే కిరణ్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, బీజేపీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి అంత మంచిది కాదంటున్నారు మరికొందరు నేతలు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu