Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ నుంచి నన్ను గెంటి వేసేందుకు కుట్ర : కేశినేని నాని

టీడీపీ నుంచి నన్ను గెంటి వేసేందుకు కుట్ర : కేశినేని నాని
, శుక్రవారం, 21 నవంబరు 2014 (12:31 IST)
తెలుగుదేశం పార్టీ నుంచి తనను గెంటి వేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నాయని విజయవాడ స్టిటింగ్ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఇవి బెజవాడ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తనను పార్టీ నుంచి గెంటి వేసేందుకు కొన్ని దుష్టశక్తులు యత్నించాయని, మొన్నటి ఎన్నికల్లోనూ తనకు టికెట్ రాకుండా ఆ శక్తులే అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. 
 
కేంద్ర మంత్రి సుజనా చౌదరి సన్మానం కోసం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఆ దుష్టశక్తులు ఎవరన్న విషయంపై నాని స్పష్టత ఇవ్వలేదు. దీంతో నాని పేర్కొన్న దుష్ట శక్తులు ఎవరన్న విషయంపై ప్రస్తుతం పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu