Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ..సారూ.. గా. ఆంధ్రోళ్ళు యాగీ చేస్తున్నారు...! జర చూసుకోండ్రీ.. గవర్నర్‌ను కలిసిన కేసీఆర్

ఓ..సారూ.. గా. ఆంధ్రోళ్ళు యాగీ చేస్తున్నారు...! జర చూసుకోండ్రీ.. గవర్నర్‌ను కలిసిన కేసీఆర్
, బుధవారం, 5 ఆగస్టు 2015 (06:57 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సుమారు మూడుగంటల సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతుల్లేకుండానే నిర్మిస్తూ తెలంగాణ నిర్మించ తలపెట్టిన పాలమూరు ప్రాజెక్టుపై అనవసర యాగీ చేస్తున్నారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలని కోరినట్లు సమాచారం. 
 
మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్నా ఆయన రాత్రి 9.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పాలమూరు ఉమ్మడి ఏపీలోనే అన్ని అనుమతులు వచ్చాయి. అయినప్పటికీ దీనిపై ఏపీ అభ్యంతరాలు చెబుతోందని చెప్పారు. అదే సమయంలో ఏపీలో ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తోందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇలాగే రాయలసీమలో అనుమతుల్లేని ప్రాజెక్టులు చాలా నిర్మించారని ఆరోపించినట్లు తెలుస్తోంది.
 
 దీని పై కేంద్రం ప్రశ్నిస్తే, ఆయా ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టామని, కట్టిన ప్రాజెక్టులను కూలగొట్టలేమని చెబుతూ వచ్చింది. ఇప్పుడు అలాగే పట్టిసీమను నిర్మిస్తోంది. రేపు.. నిధులు వెచ్చించామనే వాదన సైతం వినిపిస్తా రు. ఇదీ ఏపీ తీరు అని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. పైగా పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమంటూ ఏపీ సర్కార్‌ కేంద్రాన్ని కూడా తప్పుదోవపట్టిస్తోందని అన్నట్లు సమాచారం. 
 
అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ, తెలుగు యూనివర్సిటీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ వద్ద పూర్తిగా సమర్థించుకున్న ట్లు తెలిసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత వివాదం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. శిథిలావస్థకు చేరిన భవనంలో ఆస్పత్రిని కొ నసాగించలేమని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. వారసత్వ సంపద అనే ఒకే ఒక్క కారణంతో అదే భవనంలో ఆస్పత్రిని కొనసాగించి రోగులను ప్రమాదంలో పడేయలేమని అన్నారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu