Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారు బతుకమ్మలను ఎత్తుదాం.. బంగారు తెలంగాణను సాధిద్దాం!

బంగారు బతుకమ్మలను ఎత్తుదాం.. బంగారు తెలంగాణను సాధిద్దాం!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (11:35 IST)
బంగారు బతుకమ్మలను ఎత్తుదాం, బంగారు తెలంగాణను సాధిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపు ఇచ్చారు. మంగళవారం మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో మంత్రి హరిష్‌రావు నివాసంలో ఆమె బతుకమ్మను పేర్చారు.
 
హరీష్‌రావు భార్య శ్రీనితతో కలిసి కవిత బతుకమ్మకు మంగళహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భ్గంగా కవిత మాట్లాడారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ చేసుకోవాలంటే అనుమతి తెచ్చుకుని చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిందని, తొలి బతుకమ్మ పండుగను మనం చేసుకుంటున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu